: పాక్ లో ఉరిశిక్షలకు బ్రేక్... తాత్కాలికంగా నిలుపుదల చేసిన ప్రభుత్వం


పాకిస్థాన్ లో కరుడుగట్టిన పలువురు ఉగ్రవాదులకు ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసింది. అయితే కొంతకాలం పాటు ఉరిశిక్షకు స్వస్తి చెబుతూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న ఆ దేశ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉరిశిక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. పెషావర్ ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల భీకర దాడి నేపథ్యంలో అప్పటిదాకా ఉరిశిక్షలపై అమలవుతున్న నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. వివిధ కేసుల్లో ఉరిశిక్షలు పడి జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాదులను ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ఉరి తీసింది.

  • Loading...

More Telugu News