: లలిత్ మోదీ వీసాకు సుష్మా సిఫారసు...విదేశాంగ మంత్రి రాజీనామాకు డిగ్గీ రాజా డిమాండ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా మంజూరు చేయాలని సిపారసు చేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన మోదీ వీసా కోసం బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ఎలా సిఫారసు చేస్తారని డిగ్గీ రాజా ప్రశ్నించారు. లలిత్ మోదీ భార్య కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆమెకు వైద్య చికిత్సల కోసమే లలిత్ మోదీ వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కారణంగానే మానవతా దృక్పథంలో మోదీకి వీసా మంజూరు చేయాలని సిఫారసు చేశానని సుష్మా చెబుతున్నారు.