: తెలంగాణ సర్కారు కుట్రతోనే చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్... విరసం నేత వరవరరావు


చత్తీస్ గఢ్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. తెలంగాణ సర్కారు కుట్రలో భాగంగానే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన విమర్శించారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నల్లగొండ జిల్లా సూర్యాపేట వాసి వివేక్ అంత్యక్రియలు కొద్దసేపటి క్రితం ముగిశాయి. వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించిన వరవరరావు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వివేక్ ను తెలంగాణ సర్కారు అన్యాయంగా పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. మావోయిస్టులను పట్టుకుని పోలీసులు కాల్చిచంపారని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News