: తిరుమల కొండపై అనుష్క... చుక్కలు చూపించిన అభిమానులు


టాలీవుడ్ అగ్రనటి అనుష్కకు తిరుమల కొండపై అభిమానులు చుక్కలు చూపారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిన్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుష్క నేటి ఉదయం వెంకన్న దర్శనం కోసం తిరుమలకు చేరుకుంది. కొండపై ఆలయానికి అల్లంత దూరంలోనే కారును నిలిపేసిన అనుష్క కాలి బాటన ఆలయానికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. అయితే అనుష్కను గుర్తు పట్టేసిన అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్దారు. ఒకానొక దశలో ఆమెపై పడబోయారు. దీంతో అనుష్క తీవ్ర అసహనానికి గురైంది. వెనువెంటనే కారు వద్దకు చేరుకుని కారులోనే ఆలయ సమీపానికి చేరుకుంది. దేవుడిని దర్శించుకునేందుకు వస్తే, ఈ అభిమానుల గోలేంటీ? అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసిందట.

  • Loading...

More Telugu News