: శ్రీవారి గోపురం మీదుగా విమానం... విచారణకు ఆదేశించిన టీటీడీ చైర్మన్
ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమాన రాకపోకలు నిషిద్ధం. అయితే ఈ నిబంధనలను అతిక్రమిస్తూ ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం నిన్న శ్రీవారి గోపురం పై నుంచి వెళ్లింది. దీనిపై వేగంగా స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో మాట్లాడానని ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పారు. అంతేకాక ఇకపై ఇలాంటి అతిక్రమణలను నివారించేందుకు తిరుమల కొండ ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించేలా చర్యలు చేపడతామని చదలవాడ తెలిపారు.