: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు కసరత్తు... ముఖ్యనేతలతో భేటీ


ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నేటి ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాయలసీమ జిల్లాల్లో అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల దాఖలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఆంధ్రా ప్రాంతంలో మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారే పూర్తి కాలేదు. మరోవైపు నామినేషన్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు దృష్టి సారించారు. ప్రధానంగా విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థుల ఖరారుపైనే నేటి సమావేశంలో చంద్రబాబు దృష్టి సారించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News