: ఓటుకు నోటుపై చంద్రబాబు సమీక్ష...డీజీపీ, ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల హాజరు


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు, దర్యాప్తులో భాగంగా వెలుగుచూస్తున్న విషయాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన రాష్ట్రానికి చెందిన పోలీసు బాసులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలు హాజరయ్యారు. కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాలు, సేకరించిన ఆధారాలు, అందుకోసం టీ పోలీస్ అతిక్రమించిన నిబంధనలు తదితరాలపై చంద్రబాబు పోలీసు బాసులతో చర్చిస్తున్నారు. అంతేకాక ఈ కేసులో కేంద్రానికి తాము చేసిన ఫిర్యాదు, కేంద్రం స్పందన, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన అంతర్గత దర్యాప్తు తదితరాలపైనా చంద్రబాబు సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News