: దేశంలో కేసీఆరే బెస్ట్ సీఎం... జేపీ కితాబు!
దేశంలో ఉత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే అగ్రస్థానమని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ మేరకు నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే కేసీఆర్ సత్తా చాటారని కూడా జేపీ కితాబిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం అవతరించిన ఏడాదిలోనే తెలంగాణలో కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారని జేపీ అన్నారు. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యకు చెక్ పెట్టిన ఘనత కేసీఆర్ దేనని కూడా జేపీ అన్నారు. ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో తెలంగాణ సస్యశ్యామలం కావడమే కాక భవిష్యత్ రూపురేఖలే మారిపోనున్నాయని ఆయన పేర్కొన్నారు.