: చంద్రబాబు ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇబ్బంది పెడుతున్నారు!: టీ సర్కారుపై కంభంపాటి ఫైర్
అభివృద్ధిలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పోటీ పడలేకే ఆయన ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఆరోపించారు. నేటి ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఇరు రాష్ట్రాల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని టీ సర్కారు పెద్దలు చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఈ పనికి పాల్పడ్డారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చంద్రబాబును నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.