: గవర్నర్ తో ముగిసిన ఏపీ మంత్రుల సమావేశం
గవర్నర్ నరసింహన్ తో ఏపీ మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేయాలని అడిగామని చెప్పారు. బాంబులు వేసి డ్యాంను పేల్చివేస్తామని ఓ ముఖ్యమంత్రి అనడం అసహ్యం కలిగించిందని కేఈ పేర్కొన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. గవర్నర్ ను కలిసిన వారిలో మంత్రులు బొజ్జల, రావెల, పీతల, కామినేని శ్రీనివాస్, నారాయణ కూడా ఉన్నారు.