: ఎవరీ రాజమౌళి?... అని అడిగారు: కృష్ణంరాజు
సీనియర్ నటుడు కృష్ణంరాజు బాహుబలి ఆడియో వేడుకలో మాట్లాడారు. మైక్ ముందు మాట్లాడాలంటే తొలిసారిగా కొంచెం భయంగా ఉందని, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభాస్ గురించి చెబుతూ, మిర్చిలాంటి పొగరుబోతు, డార్లింగ్ వంటి మంచివాడు, మంచి స్నేహితుడు అని పేర్కొనగానే అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఇక, దర్శకుడు రాజమౌళి గురించి కూడా చెప్పారు. ఈ సినిమాలో తాను నటించలేదు కాబట్టి, బాహుబలికి సంబంధించినంతవరకు తనకు తెలిసిన టెక్నీషియన్ రాజమౌళి ఒక్కడేనని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లినప్పుడు రాజకీయవేత్తలు, మంత్రులు ఏమిటీ బాహుబలి?... ఎవరీ రాజమౌళి? అని అడిగారని తెలిపారు. భారతీయ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లగలిగిన దర్శకుడు ఆయనేనని తాను చెప్పానని కృష్ణంరాజు వివరించారు.