: మీరు బాహుబలి, భల్లాలదేవ ఫ్యాన్స్ అయితే నాకేంట్రా?: హడలెత్తించిన కాలకేయ యుద్ధ ప్రభువు
తిరుపతి ఎస్వీయూ మైదానాన్ని కాలకేయ యుద్ధ ప్రభువు తన గర్జనలతో హడలెత్తించాడు! బాహుబలి చిత్రంలో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ వేదికపైకి వచ్చి సినిమాలో తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన భాషలో మాట్లాడారు. ఆయన మాటలకు యాంకర్ సుమ తెలుగు అనువాదం చేశారు. ఆ తర్జుమా ఇలా సాగింది... "ఏమిటి మీరంతా! బాహుబలి, బల్లాలదేవ అభిమానులా... అయితే నాకేంట్రా! నా వెనుక లక్షలమంది సైన్యం ఉంది. వాళ్లను చూస్తేనే మీ గుండెలు జారుతాయి. యుద్ధభూమికి రండి... మీ బాహుబలిని, మీ బల్లాలదేవుడిని, మిమ్మల్ని అవలీలగా నలిపేస్తా" అని అన్నారు. ప్రభాకర్ చెప్పిన డైలాగులను అందరూ ఆస్వాదించారు.