: ఏపీ మంత్రి దేవినేని ఉమపై నారాయణగూడ పీఎస్ లో ఫిర్యాదు


తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హైదరాబాదు నారాయణగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆయనపై ఐపీసీ 153 (ఏ), 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని జేఏసీ పేర్కొంది. దేవినేని ఉమ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో ఆరోపించింది. ప్రాజెక్టుల విషయమై సీఎం కేసీఆర్, దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఘాటైన పదజాలంతో ఉమపై విమర్శలు చేయగా, ఉమ కూడా ప్రతి విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News