: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 'గీతమ్' విద్యాసంస్థల చైర్మన్?
విశాఖలో స్థానిక సంస్థల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గీతమ్ విద్యాసంస్థల చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తికి అవకాశం లభించినట్టు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు మూర్తి పేరును ఖరారు చేసినట్టు సమాచారం. మూర్తి పేరును నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిఫారసు చేశారట. మరి వియ్యంకుడు చెబితే చంద్రబాబు ఓకే చెప్పకుండా ఉంటారా? అని రాజకీయ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం నేపథ్యంలో ఎంవీవీఎస్ మూర్తి శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలిసే అవకాశాలున్నాయి.