: మంత్రి ఈటెలకు సీఎం కేసీఆర్ ఫోన్
రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెంటనే ఈటెలకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఈటెల హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. కాగా, ఈటెలకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రి వైద్యులకు సూచించారు.