: తెలుగుదనం ఉట్టిపడేలా పుష్కరాల్లో ఏర్పాట్లు ఉంటాయి: పరకాల
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. పుష్కరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉంటాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు, పుష్కరాల కమిటీ చైర్మన్ పరకాల ప్రభాకర్ అన్నారు. పుష్కరాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షకు పరకాల ప్రభాకర్, ఎంపీ మురళీమోహన్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత పరకాల మీడియాతో మాట్లాడుతూ... పుష్కరాల సందర్భంగా సినీ, సంగీత కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పుష్కరాల వేళ సినీ నటులకు, కళాకారులకు సర్కారు తగిన వసతి సదుపాయాలు కల్పించాలని రాఘవేంద్రరావు కోరారు. ఇక, మురళీమోహన్ మాట్లాడుతూ... గంగాహారతి తరహాలో గోదావరి హారతి కార్యక్రమం ఉంటుందని వివరించారు.