: తిరుమల ఆలయంపై విమానం కలకలం!


తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రయాణించడం కలకలం సృష్టించింది. ఆలయ గోపురం మీదుగా విమానం వెళ్లడం భద్రతా పరమైన ఆందోళనను మరోసారి తెరపైకి తెచ్చింది. శ్రీవారి ఆలయాన్ని, తిరుమలను నోఫ్లయ్యింగ్ జోన్ గా పరిగణిస్తూ, ఉత్తర్వులు జారీ చేయాలని టీటీడీ ఇప్పటికే పలుమార్లు ఏవియేషన్ అథారిటీకి, కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా స్పందన రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, గడచిన పది రోజుల వ్యవధిలో ఆలయం మీదుగా విమానం వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News