: డల్లాస్ పోలీస్ హెడ్ క్వార్టర్ పై కాల్పులు... అడ్డుకునేందుకు పంపిన రోబో ధ్వంసం


అమెరికాలోని డల్లాస్ పోలీస్ అధికార కార్యాలయంపై నలుగురు దుండగులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలతో దాడికి యత్నించడం కలకలం సృష్టించింది. పోలీసు హెడ్ క్వార్టర్స్ ను టార్గెట్ గా చేసుకుని వారు కాల్పులు ప్రారంభించడంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని ఎదుర్కొనేందుకు రోబోను పంపారు. దీన్ని గమనించిన దుండగులు, కొన్ని బ్యాగులు వదిలి పారిపోయారని తెలిపారు. వారు వదిలి వెళ్లిన ఓ బ్యాగును రోబో కదిలించగా, అది పేలిపోయింది. ఈ ఘటనలో రోబో కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అంతకుముందు ఓ పోలీసు వాహనం కింద బాంబులను ఉంచారని అధికారులు తెలిపారు. వారు వదిలి వెళ్లిన బాంబులను గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించామని వివరించారు. దుండగులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు తెలియజేశారు. డల్లాస్ పోలీస్ కార్యాలయంపై ఈ తరహా దాడి జరగడం ఇదే తొలిసారని పోలీసు డిపార్టుమెంట్ ట్విట్టర్లో తెలిపింది.

  • Loading...

More Telugu News