: తప్పిపోయిన విమానం ఆచూకీ లభ్యం
ఈ వారం మొదట్లో అదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సంధ్యాక్ నౌక విమానం నుంచి వస్తున్న సంకేతాలను రికార్డు చేసిందని తెలిపారు. దీనికితోడు అదే ప్రాంతంలో సముద్రంపై చమురు తేలుతూ రంగురంగుల వలయాలు కనిపించాయని, ఆ ప్రాంతంలోనే విమానం కూలిపోయి వుండవచ్చని వివరించారు. రికార్డు చేసిన సిగ్నల్స్ ను తదుపరి విశ్లేషణ నిమిత్తం ల్యాబొరేటరీకి పంపామని తెలిపారు. కాగా, మిస్సయిన విమానం కోసం 14 షిప్పులు, ఒక సబ్ మెరైన్ సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.