: హైదరాబాదులో పలు చోట్ల వర్షం... ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాదులో పలు చోట్ల వర్షం కురిసింది. బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, అమీర్ పేట, లక్డీకాపూల్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ముషీరాబాద్, అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కూడళ్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు, తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.