: ఐస్ బకెట్, రైస్ బకెట్ తరువాత సరికొత్త చాలెంజ్ వచ్చేసింది... తెగ ట్రై చేస్తున్న నెటిజన్లు!


ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ ల రోజులు పోయాయి. తాజాగా 'బెల్లీ బటన్ చాలెంజ్' వచ్చేసింది. ఇదేం చాలెంజ్ అని అనుకుంటున్నారా? ఏదైనా మీ చేతిని వీపుపై నుంచి తిప్పుతూ, మీ బొడ్డును తాకడమే... ఈ చాలెంజ్ చైనా సామాజిక మాధ్యమాల్లో మొదలై ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఈ ఫీట్ ను సాధించేందుకు చాలా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజిలో ఉన్న అమ్మాయిలు ఈ చాలెంజ్ లో విజయం సాధించేందుకు పోటీ పడుతున్నారని బీబీసీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఒక్క రోజులో కోటీ 30 లక్షల మంది చాలెంజ్ వీడియోను తిలకించారని, దీనిపై జరిగిన చర్చలో లక్ష మందికి పైగా పాల్గొన్నారని బీబీసీ వెల్లడించింది. కాగా, దీన్ని పూర్తి చేస్తే, వారు నాజూకుగా ఉన్నట్లని, ఓడిపోతే, వారు బరువు తగ్గాల్సిందేనని వైద్య నిపుణులు అంటుండగా, అదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తున్న వారూ ఉన్నారు. మరి మీరూ ఈ చాలెంజ్ ట్రై చేస్తారా?

  • Loading...

More Telugu News