: 'ధవళేశ్వరం' మృత్యుంజయుడిని దత్తత తీసుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి పై నుంచి గోదావరిలోకి వాహనం పడిపోయిన ఘటనతో ఉత్తరాంధ్రలో విషాదం అలముకుంది. శుక్రవారం రాత్రి దుర్ఘటన జరిగినా, తెల్లవారిన తర్వాత స్థానికులు చూసేంతవరకు విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. ఈ ప్రమాదంలో మొత్తం 22 మంది చనిపోగా, ఈగల కిరణ్ సాయి అనే బాలుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నది కిరణ్ ఒక్కడే. ప్రమాదంలో కిరణ్ తల్లిదండ్రులు, సోదరి కూడా ప్రాణాలు విడిచారు. దీంతో, అనాథలా మిగిలిన ఆ బాలుడిని తాను దత్తత తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.