: పీఎఫ్ క్లయిముల కోసం ఆండ్రాయిడ్ యాప్
మీ ప్రావిడెంట్ ఫండ్ ను పొందేందుకు అవస్థలు పడుతున్నారా? పీఎఫ్ ఆఫీసు చుట్టూ తిరగలేకపోతున్నారా? మీ కోసమే వచ్చేసింది ఓ సరికొత్త యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ వ్యవస్థలపై పనిచేసేలా, పీఎఫ్ క్లయిముల కోసం వినూత్న యాప్ ను విడుదల చేయనున్నట్టు ఫైనాన్షియల్ సేవల సంస్థ వైట్ ఐఎన్సీ వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్ కోసం దీన్ని తయారు చేశామని, ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న యాప్ రెండు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు అభయ్ చందాలియా వివరించారు. చేస్తున్న క్లయిము మొత్తాన్ని బట్టి కొంత రుసుమును సేవలందుకునేందుకు చెల్లించాల్సి వుంటుందని ఆయన అన్నారు. కాగా, ఇండియాలో సుమారు రూ. 27 వేల కోట్లకు పైగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఎవరూ క్లయిమ్ చేయకుండా ఉండిపోయిందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలియజేశారు.