: స్మృతీ ఇరానీది తప్పుడు డిగ్రీ... విచారణకు ఆప్ డిమాండ్
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తప్పుడు డిగ్రీ ధ్రువపత్రాలను సమర్పించారని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించాడన్న ఆరోపణలపై అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతీ ఇరానీ, రామ్ శంకర్ కథేరియాలపై కూడా విచారించాలని ఆప్ అంటోంది. ఇరానీ, కథేరియాల వ్యవహారంపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. తోమర్ ఘటనపై పార్టీ అంతర్గత లోక్ పాల్ విచారణ జరుపుతుందని తెలిపింది.