: రవాణా శాఖ నిర్లక్ష్యంతోనే ధవళేశ్వరం ప్రమాదం... ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్య
రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ధవళేశ్వరం ప్రమాదం చోటుచేసుకుందని బీజేపీ నేత, ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. పరిమితి మించి వ్యక్తులతో ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే తూఫాన్ వాహనం ధవళేశ్వరం బ్యారేజీలో బోల్తా కొట్టిందని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. కేవలం 12 మంది ప్రయాణించేందుకు అనువైన ఆ వాహనంలో మొత్తం 23 మంది ఎక్కారన్నారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను నియంత్రించడంలో రవాణా శాఖ అధికారులు వైఫల్యం చెందారని ఆయన ఆరోపించారు.