: మల్కాజిగిరీ ఎంపీ మల్లారెడ్డికి నకిలీ ఐఏఎస్ టోకరా...పోలీసులకు పట్టుబడ్డ ఘరానా మోసగాడు!


తెలుగు రాష్ట్రాల్లో ఓ నకిలీ ఐఏఎస్ హల్ చల్ చేశాడు. ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఆ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే... రాఘవేంద్ర అనే ఓ యువకుడు తాను ఐఏఎస్ అధికారినంటూ ప్రజా ప్రతినిధులకు పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సీడీ రుణాలిప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటల గారడీలో పడి అతడు అడిగిన మేరకు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరీ ఎంపీ మల్లారెడ్డితో పాటు, మల్కాజిగిరీ ఎమ్మెల్యే కనకారెడ్డి కూడా అతడి బుట్టలో పడ్డారు. తీరా అనుకున్న మేర డబ్బు చేతిలో పడగానే ఆ యువకుడు మాయమయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన మల్లారెడ్డి, కనకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను బురిడీ కొట్టించినట్లు వెల్లడైంది.

  • Loading...

More Telugu News