: అమెరికాలో డిగ్రీ చదివితే ఆరేళ్లు అక్కడే ఉండొచ్చు... మారనున్న నిబంధనలు!
ఇకపై అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు హెచ్1-బీ వీసాలను పొందలేకపోతే, 'హెచ్1-బీ'లుగా మారాలని భావించేవారిని విధుల్లోకి తీసుకునే సౌలభ్యం దగ్గర కానుంది. వేలాది మంది విదేశీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ఒబామా సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుండడమే ఇందుకు కారణం. అమెరికాలో డిగ్రీ విద్యను అభ్యసించే వారు, చదువు పూర్తయిన తరువాత ఆరేళ్ల పాటు అక్కడే ఉండేలా నిబంధనలు సవరించాలని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ప్రతియేటా యూఎస్ లో ఉన్నత విద్యను అభ్యసించే వందలాది మంది భారత విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.