: మీ ఫేవరెట్ ఐస్ క్రీం ఏంటో చెబితే... మీరెలాంటి వారో తెలిసిపోతుందట!
మీకిష్టమైన ఆహార పదార్థాల జాబితాలో టాప్-5లో ఐస్ క్రీం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది ఏ ఫ్లేవరైనా కావచ్చు. అయితే, ఇష్టమైన ఐస్ క్రీం ఫ్లేవర్ ఏంటో చెబితే, వారు ఎలాంటివారో తెలిసిపోతుందట. మీకు వెనీలా ఇష్టమైతే, కొత్త ప్రయోగాలు చేసేందుకు ఉత్సుకత చూపుతారట. జీవితానికి ఇంకేదో జోడించాలనే తాపత్రయం ఉంటుందట. చిన్న చిన్న విజయాలకు పెద్ద ఆత్మసంతృప్తిని పొందుతారట. ఇక చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వారు "ఐయామ్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్" అనుకుంటారు. స్మార్ట్ గా, అందంగా కనిపించడానికి, చుట్టూ ఉన్నవారు ఇష్టపడేలా ఉండాలని కోరుకుంటారట. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలిసిన వారుగా, చేస్తున్న పనితో సంతృప్తి చెందుతూ ఆనందంగా ఉంటారట. జీవితాన్ని లక్ష్యంలా తీసుకోకుండా, ప్రయాణంలా భావిస్తూ కాలం గడిపేస్తారట. ఒకవేళ మీకు స్ట్రాబెరీ ఇష్టమైతే, ఎల్లప్పుడూ శాంతికాముకులుగా ఉంటారట. ప్రపంచంతో సంబంధం లేకుండా మీదైన జీవనం గడుపుతూ, రిజర్వుడుగా, కాస్తంత సిగ్గుపడుతూ, ఇష్టమైన నేతను అనుసరిస్తూ ఉంటారట. ఇక కాఫీ ఫ్లేవర్ ఇష్టపడేవారు కొత్త పనులను మొదలు పెట్టడంలో వేగం చూపినా, వాటిని పూర్తి చెయ్యడంలో మాత్రం అలసత్వం చూపుతారట. పని పూర్తి చేయడంలో ఆత్రుత చూపినప్పటికీ, అందుకు తగిన విధంగా మాత్రం చేయరట. బటర్ స్కాచ్ ఇష్టపడుతున్నట్లయితే, తోటివారందరితో పోలిస్తే, కనీసం ఒక్కసారన్నా 'బెస్ట్' అనిపించుకుంటారట. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారట. ఫోన్ల ద్వారా మెసేజ్ పెట్టడం కంటే, ఒకసారి స్వయంగా మాట్లాడితేనే మేలు కలుగుతుందని భావిస్తారట. మరి, మీరు ఏ జాబితాలో వున్నారు?