: 'సెల్ఫీ విత్ డాటర్' పోటీ... సూపర్ రెస్పాన్స్!
ఇది సెల్ఫీ యుగం. సెల్ఫీతో నిద్రలేచి, సెల్ఫీతో నిద్రకు ఉపక్రమించే నెటిజన్లు కోకొల్లలు. అయితే, 'సేవ్ గర్ల్ చైల్డ్' ప్రచారంలో భాగంగా హర్యానాలోని ఓ గ్రామ పంచాయతీ వినూత్న అడుగువేసింది. 'సెల్ఫీ విత్ డాటర్' పేరిట పోటీని ప్రకటించింది. రాష్ట్రంలోని తల్లిదండ్రులంతా తమ ఆడబిడ్డలతో సెల్ఫీలు తీసి వాట్సాప్ ద్వారా పంపాలని బిబిపూర్ గ్రామ పంచాయతీ తెలిపింది. అత్యుత్తమ సెల్ఫీలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు ఇస్తామని వెల్లడించింది. ఈ చిత్రాలను 30 మంది మహిళా సర్పంచులు, అంగన్ వాడీ కార్యకర్తలు పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారని తెలిపింది. ఈ పోటీకి హర్యానా రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.