: 462 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను 462 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వరుణుడు పలుమార్లు అడ్డుకున్న ఈ మ్యాచ్ లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 462 పరుగుల వద్ద ఉన్న భారత్, అదే స్కోరుపై డిక్లేర్ చేస్తూ, నాలుగో రోజు బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆరవ ఓవర్ ఆఖరి బంతికి బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయి పెవీలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు ఆరు ఓవర్లలో 27/1.