: బాలయ్య ఆస్పత్రికి అరుదైన గౌరవం...అత్యుత్తమ ఆంకాలజీ ఆస్పత్రిగా ‘బసవతారకం’ ఎంపిక!


దేశంలో కేన్సర్ వ్యాధికి అత్యుత్తమ చికిత్స కావాలంటే, హైదరాబాదు రావాల్సిందే. ఎందుకంటే ఈ వ్యాధి చికిత్సలో దేశంలోనే అత్యుత్తమ సేవలందిస్తున్న ఆస్పత్రిగా టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ఎంపికైంది. ఈ మేరకు సీఎన్బీసీ 18, ఐసీఐసీఐ లాంబార్డ్ సంయుక్తంగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక హెల్త్ కేర్ అవార్డును ఈ ఆస్పత్రి దక్కించుకుంది. అత్యాధునిక చికిత్సా విధానం బసవతారకం సొంతం. అంతేకాక రోగులకు సేవల విషయంలోనూ ఈ ఆస్పత్రిని మించిన మరో వైద్యాలయం దాదాపుగా లేదనే చెప్పాలి. దీనిని గుర్తించిన ఆ రెండు సంస్థలు దేశంలో అత్యుత్తమ ఆంకాలజీ ఆస్పత్రిగా బసవతారకం ఆస్పత్రిని ఎంపిక చేశాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ ఆర్పీ సింగ్, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావులు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ నుంచి అవార్డును అందుకున్నారు.

  • Loading...

More Telugu News