: నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులు వస్తున్నారట!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ సర్కారు ఏకంగా ముగ్గురు ప్రధానులను రప్పిస్తోందట. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీకి గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో అమరావతి పేరిట కొత్త రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భూమిపూజను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 6న ఘనంగా నిర్వహించారు. ఇక నిర్మాణ పనులు రానున్న దసరా పర్వదినాన ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానానికి వేగంగా స్పందించిన మోదీ తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారట. ఇక రాజధాని నిర్మాణంలో ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్న సింగపూర్, జపాన్ ప్రధానులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనుకుంటున్నామన్న చంద్రబాబు ప్రతిపాదనకు మోదీ కూడా పచ్చజెండా ఊపారట. త్వరలో ఆ దేశాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఆ రెండు దేశాల ప్రధానులను కూడా శంకుస్థాపన కార్యక్రమానికి పిలవనున్నారు.

  • Loading...

More Telugu News