: అది మా చేతుల్లో లేదు: ఓపెనర్ విజయ్
టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ బంగ్లాదేశ్ తో ఏకైక టెస్టు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. రెండో రోజు ఆట సందర్భంగా మరో ఓపెనర్ ధావన్, తాను రోజంతా ఆడదామని నిర్ణయించుకున్నామని, అయితే, వర్షం కారణంగా ఆ రోజు ఆట తుడిచిపెట్టుకుపోయిందని తెలిపాడు. వాతావరణం తమ చేతుల్లో లేదని అన్నాడు. ప్రస్తుతం తాము సురక్షిత స్థితిలో ఉన్నామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ లో విజయ్ 150 పరుగులు చేసి అవుటవడం తెలిసిందే. ఇక, తొలి రోజు ఆటలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించిందని, ఆట సాగేకొద్దీ మందకొడిగా మారిందని తెలిపాడు. దాంతో, తన బ్యాటింగ్ లో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని అన్నాడు. సాధ్యమైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని వివరించాడు. నిజాయతీగా చెప్పాలంటే తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చలేదని ఈ తమిళతంబి అభిప్రాయపడ్డాడు.