: ఎంసీఎ అధ్యక్షపోటీ నుంచి పవార్ తప్పుకోవాలి: విజయ్ పాటిల్
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పుకోవాలని ఎంసీఎ ఉపాధ్యక్షుడు విజయ్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, శరద్ పవార్ కు ప్రజల్లో, రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఆయనంటే తనకు అపరిమితమైన గౌరవమర్యాదలు ఉన్నాయని అన్నారు. అధ్యక్ష పదవిని ఈసారి తమకు వదిలేయాలని ఆయన సూచించారు. ఎంసీఎ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజుల గడువు ఉండగా, ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి.