: చిన్నపిల్లలను, వృద్ధులను తీసుకురావద్దు: ఫ్యాన్స్ కు రాజమౌళి విజ్ఞప్తి
'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఎస్వీ యూనివర్శిటీలో జరిగే ఈ వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... ఆడియో లాంచ్ కు వచ్చే ఫ్యాన్స్ కు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే, అభిమానులు తమతోపాటు చిన్నపిల్లలను, వృద్ధులను తీసుకురావద్దని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక, ఈవెంట్ కు సంబంధించిన పాస్ లను తాము విక్రయించడం లేదని, నకిలీ పాస్ లను కొని మోసపోవద్దని హెచ్చరించారు. పాస్ లను ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులకు, రానా మేనేజర్లకు మాత్రమే ఇచ్చామని, వారి నుంచే పాసులు పొందాలని సూచించారు.