: పెళ్లి రోజున నాగార్జునకు ప్రత్యేకంగా సినిమా చూపించిన అమల


పెళ్లి రోజున దంపతులు ప్రత్యేకంగా గడపడం సర్వసాధారణం. ప్రతిరోజులా కాకుండా ఏదయినా ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. సినిమా దంపతులు నాగార్జున, అమల పెళ్లి రోజు సందర్భంగా ఓ సినిమా చూశారు. తను ప్రత్యేక పాత్ర పోషించిన 'హమారీ ఆధూరీ కహానీ' సినిమాను అమల తన భర్తకు చూపించింది. పెళ్లిరోజున కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారీ దంపతులు. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్, రాజకుమార్ రావ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించింది. కేవలం ఆమె కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో అమల సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ తల్లి పాత్ర పోషించారు. నేడు విడుదలైన ఈ సినిమాను అమల, నాగార్జున దంపతులు మెచ్చుకున్నారని దర్శకుడు మోహిత్ సూరి చెప్పారు.

  • Loading...

More Telugu News