: నెలాఖర్లో తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలోని అనంతపురం, తెలంగాణలోని హైదరాబాదు, వరంగల్ జిల్లాలలో పర్యటిస్తారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం తెలంగాణలో జరిగే సభల్లో పాల్గొంటారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. పర్యటన ఖరారైనప్పటికీ తేదీలు ఖరారు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.