: కొరుకుడు పడని టీమిండియా 462/6
టీమిండియా మూడో రోజు కూడా బంగ్లాదేశ్ కు కొరుకుడు పడలేదు. వరుణుడు అడ్డం పడడంతో ఆగుతూ సాగుతున్న టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 462 పరుగులు చేసింది. 239 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా టాప్ ఆర్డర్ ను షకిబ్ అల్ హసన్ పెవిలియన్ బాటపట్టించాడు. ధావన్ (173), మురళీ విజయ్ (150), రహానే (98) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టెస్టులో రోహిత్ శర్మ (6), కోహ్లీ (14), సాహా (6) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో అశ్విన్ (2), హర్బజన్ (7) ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షకిబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, జుబైర్ హోసైన్ రెండు వికెట్లు తీసి సహకరించాడు.