: దక్షిణకొరియాలో వేగంగా వ్యాపిస్తున్న 'మెర్స్'


మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్-మెర్స్) వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 126కి చేరింది. శుక్రవారం మరో నలుగురు వ్యక్తులకు మెర్స్ పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. సియోల్ లోని శాంసంగ్ మెడికల్ సెంటర్ లోని ఓ రోగి నుంచి వీరికి వైరస్ సోకిందని అధికారులు అంటున్నారు. ఈ రోగి కారణంగా ఇదే ఆసుపత్రిలో 60 మందికిపైగా మెర్స్ బారినపడ్డారట. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు దక్షిణకొరియాలో తొమ్మిది మరణించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News