: వీళ్లతో నటిస్తే వాళ్లు గుర్తొచ్చారు: రిషికపూర్


నిన్నటి తరం బాలీవుడ్ హీరో రిషి కపూర్ (62) పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 'కపూర్ అండ్ సన్స్' సినిమాలో ఆయన అభిషేక్ బచ్చన్, సోనాక్షీ సిన్హాతో కలిసి నటిస్తున్నారు. యువ నటులతో నటిస్తుంటే 'నసీబ్' సినిమా గుర్తుకొచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. 1981లో వచ్చిన 'నసీబ్' సినిమాలో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్నసిన్హా, రిషి కపూర్ కలిసి నటించారు. ఇప్పుడు వారి పిల్లలతో కలిసి నటిస్తుంటే అచ్చం వారితో నటిస్తున్నట్టే ఉందని రిషి కపూర్ వ్యాఖ్యానించారు. రిషి కపూర్ కుమారుడు రణ్ బీర్ కపూర్ కూడా నటుడే కావడం విశేషం.

  • Loading...

More Telugu News