: రాజస్థాన్ లో పెళ్లి బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగ... 25 మంది మృతి
రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి పచేవార్ ప్రాంతంలో ఓ పెళ్లి బృందం బస్సు రాగానే విద్యుత్ తీగలు తెగిపడటంతో 25 మంది చనిపోయారు. ఘటనాస్థలిలో 18 మంది మృతి చెందగా, ఆసుపత్రిలో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలవగా, వారు దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలి వద్ద బంధువుల రోదనతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.