: ఏకంగా ఆర్టీసీ బస్సునే లేపేశారు!
హైదరాబాదులో దొంగలు ఏకంగా ఆర్టీసీ బస్సునే లేపేశారు. టీఎస్ 08 యూఏ 1418 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ తన డ్యూటీ అయ్యాక బస్సును రోడ్డుపై నిలిపేసి, ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు డ్రైవర్ వచ్చి చూస్తే, ఆ బస్సు మాయమైంది. దీంతో డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. గతంలో లారీలను అపహరించి, వాటిలోంచి కొన్ని పరికరాలు దోచుకున్న ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే!