: నోరు జారి... రాజీనామా చేసిన నోబెల్ బహుమతి గ్రహీత


ఏ రంగంలో పని చేస్తున్నా నైతిక విలువలు ఉండాల్సిందే. అదే పవిత్రమైన గురు వృత్తిలో అయితే మరిన్ని విలువలు అవసరం. అద్భుత పరిశోధనలకు గుర్తుగా నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త పొరపాటుగా నోరు జారారు. అనంతరం తను చేసిన వ్యాఖ్యల తీవ్రతను గుర్తించి క్షమాపణలు చెప్పారు. తరువాత పదవికి రాజీనామా చేసి తన నైతికత చాటుకున్నారు. 2001లో బయోకెమెస్ట్రీ విభాగంలో మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ పురస్కారం అందుకున్న టిమ్ హంట్ లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ సైన్స్ జర్నలిస్టుల కార్యక్రమంలో మాట్లాడుతూ, లేబోరేటరీల్లో అమ్మాయిల (మహిళా శాస్త్రవేత్తలు)తో కలిసి పనిచేయడం కొంత ఇబ్బందే అన్నారు. మహిళా శాస్త్రవేత్తలతో పనిచేస్తే మూడు సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. కలిసి పని చేసినప్పుడు వారితో ప్రేమలో పడే ప్రమాదం ఉందన్నారు. రెండోది మీరు పడకపోతే, వారే మీతో ప్రేమలో పడే ప్రమాదముందన్నారు. పరిశోధనలో భాగంగా తిడితే మహిళలు ఏడుస్తారని, అలా ఏడిస్తే పనికి అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఆయన క్షమాపణలు చెప్పి, యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో నిర్వర్తిస్తున్న కీలక పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తానేనా ఇలా మాట్లాడింది? అని ఆశ్చర్యపోయానని, తనపై తనకే జుగుప్స కలుగుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News