: భారత్ లో ఆనందమైన నగరం ఇదే!
భారతదేశంలో లెక్కలేనన్ని పట్టణాలున్నాయి. అందులో ఏ పట్టణం ఆనందంగా ఉంటుందంటే చెప్పడం కాస్త కష్టమే. అందుకే భారత్ లో ఏ నగరం ఆనందంగా ఉంటుందని దక్షిణ కొరియాకు సంబంధించిన ఎల్జీ సంస్థ సర్వే చేపట్టింది. ఎల్జీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ లో అత్యంత ఆనందంగా ఉండే పట్టణం ఛండీగఢ్ అయితే, తక్కువ సంతోషంగా ఉండే పట్టణం గౌహతీ అని తేల్చింది. దక్షిణాదిలో హైదరాబాదులోనే ఆనందంగా ఉండవచ్చని వెల్లడించింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఢిల్లీలో నెంబర్ వన్ ఆనందం దొరికితే, ముంబైలో తక్కువ ఆనందం దొరుకుతుందని వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఛండీగఢ్ నెంబర్ వన్ అయితే జైపూర్ ది చివరిస్థానం. తూర్పు రాష్ట్రాల్లో పాట్నాలో ఆనందం లభిస్తే గౌహతీలో తక్కువ ఆనందం ఉంటుంది. దక్షిణాదిలో కొచ్చి కంటే హైదరాబాదులోనే ఆనందం ఎక్కువ అని సర్వే వెల్లడించింది. పట్టణాల్లో ఆనందాన్ని వారి జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, వనరులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించింది.