: పార్లమెంటరీ సెక్రటరీల కొనసాగింపుపై హైకోర్టులో మరోసారి పిటిషన్


తెలంగాణ ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని కొనసాగించడంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదంటూ కోర్టు గత నెలలో రద్దు చేసి, ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన తాజా పిటిషన్ లో న్యాయస్థానానికి తెలిపారు. త్వరలో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా సెక్రటరీల అంశంపై పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News