: బీజేపీలో చేరబోతున్న ఒడిశా మాజీ సీఎం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. దాంతో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని గమాంగ్ తెంచుకోబోతున్నారు. 72ఏళ్ల గిరిజన నేత అయిన గమాంగ్ ఒడిశా సీఎంగా 17 ఫిబ్రవరి 1999 నుంచి 6 డిసెంబర్ 1999 వరకు ఉన్నారు. కాంగ్రెస్ తరపున 9సార్లు లోక్ సభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు.