: ఆలిండియా ప్రీమెడికల్ పరీక్షా ఫలితాల విడుదలపై స్టే పొడిగింపు
ఆలిండియా ప్రీమెడికల్ పరీక్షా ఫలితాల విడుదలపై స్టేను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం ఈరోజు విచారణ చేపట్టింది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. తుది తీర్పు వెలువడేవరకు ఫలితాలు విడుదల చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షకు ముందే పేపర్లు లీకవడంతో దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో తెలుసుకుని ఓ నివేదిక సమర్పించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు హర్యానా పోలీసులను ఆదేశించింది.