: మీ యాక్షనుకు మా రియాక్షనూ చూపిస్తాం: యనమల


తెలంగాణ సర్కారు రాజకీయ ప్రతీకారాలకు దిగుతోందని, టీఆర్ఎస్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, దానికి తగ్గట్టుగా తమ వైపు నుంచి రియాక్షన్ చూపిస్తామని ఆంధ్రప్రదశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈ ఉదయం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కేసు కోర్టు పరిధిలో ఉందని, తమ సీఎం చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేసిన అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని ఆధారాలనూ కేంద్రానికి నివేదిక రూపంలో పంపామని యనమల వివరించారు. కేంద్రం ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయానికి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News