: హెచ్1-బీ వీసా నిబంధనలు అతిక్రమించిన టీసీఎస్, ఇన్ఫోసిస్... అమెరికా విచారణ మొదలు!


హెచ్1-బీ వీసాల దరఖాస్తు విషయంలో భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ లు నిబంధనలను అతిక్రమించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యూఎస్ అధికారులు విచారణ మొదలు పెట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమెరికన్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించి హెచ్-1బీ వీసాలున్న భారతీయులను ఈ కంపెనీలు చేర్చుకున్నాయన్నది ప్రధాన ఆరోపణ. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ ప్రారంభమైందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్ధలు, వారి స్థానంలో తాత్కాలిక వర్క్ వీసాలున్న వారితో నింపాయని సెనెటర్ రిచర్డ్ డుబ్రిన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News