: పురుగు మందుల వాడకం తగ్గిస్తేనే మీ కూరగాయలు కొంటాం: తమిళనాడుకు కేరళ సీఎం లేఖ
తమిళనాడు కూరగాయల రైతులు సాగులో పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారట. ఈ కారణంగా తమిళనాడు రైతులు పండిస్తున్న కూరగాయలను దిగుమతి చేసుకునేందుకు కేరళ నిరాకరిస్తోంది. దీంతో కూరగాయల సాగుకు ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని కోయంబత్తూరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి కేరళ ప్రభుత్వం తమ కూరగాయలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయించేలా చర్యలు చేపట్టాలని రైతులు తమిళనాడు సీఎం జయలలితను కోరారు. విషయం తెలుసుకున్న కేరళ సీఎం ఉమెన్ చాందీ, తమిళనాడు ప్రభుత్వం నుంచి లేఖ రాకముందే తమ అభ్యంతరాలను తెలుపుతూ లేఖ రాశారు. ‘‘మీ కూరగాయల సాగులో పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. సదరు పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తే కాని మీ కూరగాయలను కొనలేం’’ అని ఉమెన్ చాందీ ఆ లేఖలో పేర్కొన్నారు.